
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
● జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్‌శర్మ
● వెబ్‌ల్యాండ్ కరెక్షన్ అర్జీపై
క్షేత్రస్థాయి పరిశీలన
అనంతపురం రూరల్:భూ సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్‌శర్మ హెచ్చరించారు. అనంతపురం రూరల్ మండలం ఏ. నారాయణపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 150–5లో వెబ్‌ల్యాండ్ కరెక్షన్‌పై వచ్చిన అర్జీపై మంగళవారం జేసీ శివ్‌నారాయణ్ శర్మ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలపై వచ్చే అర్జీలపై అధికారులు ఎప్పటికప్పుడు విచారణ చేపట్టి పరిష్కరించాలన్నారు. రెవెన్యూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అర్జీదారులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ హరికుమార్, మండల సర్వేయర్ రఘునాథ్, వీఆర్‌ఓ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.