
పడిగాపులు.. ఎదురుచూపులు
● కూటమి ప్రభుత్వ అలసత్వంతో
రైతులకు తప్పని అవస్థలు
బొమ్మనహాళ్: రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. అన్నదాతలు ఇంకా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ‘యూరియా కొరత లేదు.. ప్రతి రైతుకూ అందిస్తాం’ అంటూ అధికారులు చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేకుండా పోతోంది. ఒక వైపు పొలం పనులు చేసుకుంటూనే మరో వైపు ఎరువుల కోసం పరుగులు పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. బొమ్మనహాళ్ మండలంలోని ఉద్దేహాళ్, శ్రీధరఘట్ట గ్రామ సొసైటీలకు యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతన్నలు సోమవారం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామునే క్యూలో ఆధార్‌కార్డులు, పాస్ పుస్తకాలు ఉంచారు. అరకొరగా వచ్చిన ఎరువులను కూడా పోలీసుల ఆధ్వర్యంలో పంపిణీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అదికూడా ఒకటి లేదా రెండు బస్తాల యూరియానే అందించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. బాగా పలుకుబడి ఉన్న వారు, ప్రజాప్రతినిధులకు అనుకూలంగా ఉన్న వారికి 20 నుంచి 30 యూరియా బస్తాలు ఇస్తున్నారని రైతులు ఆరోపించడం గమనార్హం.
ఉద్దేహాళ్ సొసైటీ వద్ద యూరియా కోసం ఆధార్‌కార్డులు, పాసుపుస్తకాలను క్యూలో పెట్టిన రైతులు, యూరియా కోసం ఆందోళన చేస్తున్న దృశ్యం

పడిగాపులు.. ఎదురుచూపులు