
రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి
అనంతపురం సిటీ: అనంతపురం–తాటిచెర్ల రైల్వే స్టేషన్ల మధ్యలో హెచ్చెల్సీ కెనాల్ సమీపంలో శుక్రవారం ఉదయం రైలు నుంచి కింద పడి ఓ గుర్తు తెలియని ఓ వ్యక్తి(50) మృతి చెందాడు. సమాచారం అందుకున్న జీఆర్‌పీ ఎస్‌ఐ కె.వెంకటేశ్వర్లు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడు పింక్ కలర్ చొక్కాపై నీలం–తెలుపు గీతలున్న గళ్ల చొక్కా, తెలుపు రంగు కట్ బనియన్, నీలం రంగు షార్ట్ ధరించి ఉన్నాడు. రైలు ప్రయాణిస్తుండగా అదుపు తప్పి కింద పడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందినట్లుగా నిర్ధారించారు. అయితే మృతుడు ఎవరైందీ తెలియరాలేదు. ఆచూకీ తెలిసిన వారు 94406 27662 కు సమాచారం అందించాలని రైల్వే పోలీసులు కోరారు.