
పెత్తందార్ల కోసమే
ప్రభుత్వం నిర్వహించాల్సిన మెడికల్ కాలేజీలను తన చుట్టూ ఉండే పెత్తందార్లకు అప్పగించడం కోసమే చంద్రబాబు ప్రైవేటీకరణ మార్గం ఎంచుకుంటున్నారు. ప్రజలు ఏమైనా.. రాష్ట్రం ఏ గతిలో ఉన్నా... చంద్రబాబుకు అవసరం లేదు. తన వాళ్లు బాగుంటే చాలనుకుంటారు. గతంలో మూడుసార్లు సీఎంగా ఉన్నా.. ఏనాడూ మెడికల్ కాలేజీల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒకేసారి 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుడితే.. నాల్గోసారి సీఎం అయిన చంద్రబాబు... ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తామని ప్రకటించడం దుర్మార్గం. – అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్ సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు