
సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించిన ‘చైనా’ బృందం
అనంతపురం : సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ(సీయూఏపీ)ని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధుల బృందం, కౌన్సిలర్ యాంగ్ సీయుహువా బుధవారం సందర్శించారు. ఈ బృందంలో ఫస్ట్ సెక్రటరీ జాంగ్ హైలిన్, సెకండరీ సెక్రటరీ మిస్సు సూ చెన్, థర్డ్ సెక్రటరీ ఫాంగ్ బిన్ ఉన్నారు. వీసీ ప్రొఫెసర్ ఎస్‌ఏ కోరిని కలిసి.. విద్యలో పరస్పర సహకారంపై చర్చలు జరిపారు. ఇందులో విద్యార్థుల పరస్పర మార్పిడి, అధ్యాపకుల సహకారం, కోర్సుల నిర్వహణ వంటి అంశాలు చర్చకు వచ్చాయి. చైనా భాషలో డిగ్రీ, డిప్లొమో ప్రోగ్రాంలు ప్రారంభించడానికి గల అంశంపై సన్నాహాలు జరుగుతున్నాయి. చైనా ప్రభుత్వం అందించే ఉపకారవేతన పథకం గురించి వివరించారు. కార్యక్రమంలో సీయూఏపీ ఫారిన్ అఫైర్స్ డైరెక్టర్ డాక్ట్ బాబు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
11 మండలాల్లో వర్షం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యాప్తంగా 11 మండలాల పరిధిలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు వర్షం కురిసింది. 5 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. ఇందులో నార్పల 62.6 మి.మీ, యల్లనూరు 18.6, కూడేరు 17.4, గార్లదిన్నె 14.4, బుక్కరాయసముద్రం11.1 మి.మీ వర్షం పడగా.. ఉరవకొండ, బొమ్మనహాళ్, అనంతపురం, శింగనమల, ఆత్మకూరు తదితర మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 110.9 మి.మీ కాగా ప్రస్తుతానికి 66.8 మి.మీ నమోదైంది.
30 లోపు ఈ–పంట నమోదు చేయించుకోండి
బుక్కరాయసముద్రం/ గార్లదిన్నె: జిల్లా వ్యాప్తంగా రైతులు ఈ నెల 30లోపు ఈ–పంట నమోదు చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమా మహేశ్వరమ్మ తెలిపారు. బుధవారం మండల కేంద్రం బుక్కరాయసముద్రంలో రైతులతో సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ రైతులు ఏయే పంటలు సాగు చేశారో తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలన్నారు. తద్వారా పంట నష్టపోతే ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం మొక్కజొన్న విత్తే పరికరాలను పరిశీలించారు. కార్యక్రమంలో రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లేశ్వరి, మండల వ్యవసాయ అధికారి శ్యాంసుందర్‌రెడ్డి, ఉద్యాన సహాయకురాలు విజయశాంతి, రైతులు పాల్గొన్నారు. అలాగే గార్లదిన్నెలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి హాజరై రైతులకు సూచనలు ఇచ్చారు.
విశ్వకర్మ స్ఫూర్తితో సాగాలి
అనతపురం రూరల్: విశ్వకర్మ భగవానుని జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేటి తరం ముందుకు సాగాలని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ సూచించారు. బీసీ సంక్షేమశాఖ ఆద్వర్యంలో బుధవారం పాతూరులోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంపీ, జెడ్పీ చైర్‌పర్సన్‌తో పాటు జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణశర్మ హజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వకర్మ గొప్ప శిల్పి అని కొనియాడారు. నేటి యువత విశ్వకర్మ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నైపుణ్యాభివృద్ధి సాధించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మలోల, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకటశివుడు యాదవ్, వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ స్వప్న, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రంగాచారి పాల్గొన్నారు.

సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించిన ‘చైనా’ బృందం

సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించిన ‘చైనా’ బృందం