
రేపు జెడ్పీ సర్వసభ్య సమావేశం
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం జరగనుంది. జెడ్పీ కార్యాలయ సమావేశ భవన్‌లో ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన జరిగే సమావేశానికి అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ, కో–ఆప్షన్ సభ్యులు, ఎంపీపీలు హాజరు కానున్నారు. సర్వసభ్య సమావేశానికి సంబంధించి జెడ్పీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత సమావేశాల్లో చర్చించిన విషయాలు, పరిష్కారం తదితర అంశాలపై సమాచారంతో అధికారులు హాజరు కానున్నారు.