
మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఎంపిక
అనంతపురం అర్బన్: మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం 5వ రాష్ట్ర మహాసభలు ఆదివారం ముగిశాయి. మహాసభలో 41 మందితో కూడిన రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా జి.వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా దయా రమాదేవి, కోశాధికారిగా మద్దూరి నాగమణి (అనంతపురం) ఎన్నికయ్యారు. ఆఫీస్ బేరర్లగా మహాలక్ష్మి (శ్రీకాకుళం), సుధారాణి (విజయనగరం), వై.శాంత (పార్వతీపురం), మంగశ్రీ (విశాఖపట్నం), వరలక్ష్మి (అనకాపల్లి), నాగవరలక్ష్మి (అంబేద్కర్ కోనసీమ), నాగమణి (ఏలూరు), సుప్రజ (ఎన్‌టీఆర్ జిల్లా), సమ్మక్క (కృష్ణా జిల్లా), శివకుమారి (పలనాడు), కల్పన (ప్రకాశం), ఎస్‌కేరెహన్ (నెల్లూరు), కె.విజయమ్మ (తిరుపతి)ని ఎన్నుకున్నారు. వీరితో పాటు 25 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.
‘పార్ట్ టైం’ పదాన్ని తొలగించాలి
అనంతపురం ఎడ్యుకేషన్: సమగ్ర శిక్షలో ఆర్ట్, క్రాఫ్ట్, పీఈటీ, మ్యూజిక్ టీచర్లు 14 సంవత్సరాలుగా పార్ట్‌టైం ఉద్యోగులుగా చాలీచాలని వేతనంతో పనిచేస్తున్నారని, వీరికి పార్ట్‌టైమ్ అనే పదాన్ని తొలగించి స్పష్టమైన జాబ్‌చార్ట్‌తో మినిమం టైం స్కేల్ అమలు చేయాలని సమగ్రశిక్ష ఉద్యోగుల జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ కె.విజయ్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక పొట్టి శ్రీరాములు నగరపాలక ఉన్నత పాఠశాలలో పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ల సంఘం సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ మాట్లాడుతూ... పెండింగ్‌లో ఉన్న ఆగస్టు నెల వేతనం వెంటనే చెల్లించాలన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వయోపరిమితి 62 సంవత్సరాలకు పెంచాలని కోరారు. వేతనంతో కూడిన మెడికల్ లీవులు ఇవ్వాలని, డీఎస్సీలో వెయిటేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్.దివాకర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఈశ్వరయ్య, సభ్యులు పి.చంద్రకళ, నరేంద్ర, మధుబాబు, చౌడప్ప, గీత, జంబునాథ్, రంగనాథ్, టి.నరసింహులు, కల్పన, గౌతమి, దీప, శ్రీదేవి, కళావతి, రాజేష్, రాంప్రసాద్, సుమలత పాల్గొన్నారు.

మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఎంపిక