
తోపుదుర్తి భాస్కరరెడ్డికి కన్నీటి వీడ్కోలు
ఆత్మకూరు: వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు తోపుదుర్తి భాస్కరరెడ్డి (70) అంత్యక్రియలు ఆదివారం అశ్రునయనాల మధ్య జరిగాయి. శుక్రవారం గుండెపోటుతో ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలోని సొంత వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం నిర్వహించారు. అనంతపురంలోని తోపుదుర్తి భాస్కరరెడ్డి నివాసం నుంచి పెద్ద ఎత్తున అంతిమయాత్ర సాగింది. భాస్కర్‌రెడ్డి అంతిమయాత్ర విషయం తెలుసుకున్న ప్రజలు కక్కపల్లి కాలనీ నుంచి ఆలమూరు రోడ్డు, బి. యాలేరు, మదిగుబ్బ క్రాస్, సనప, రంగంపేట, తోపుదుర్తి గ్రామాల వరకూ ప్రతి గ్రామం నుంచి వందల సంఖ్యలో తరలివచ్చారు. దారి వెంట ట్రాక్టర్లు పెట్టి పూలు చల్లుతూ ఆయనకు నివాళులర్పించారు. భాస్కరరెడ్డి సతీమణి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తోపుదుర్తి కవితను పరామర్శించి ధైర్యం చెప్పారు.
అంతిమయాత్రలో
పాల్గొన్న ప్రముఖులు
తోపుదుర్తి భాస్కరరెడ్డి అంత్య క్రియల్లో వైఎస్సార్‌సీపీ ఉభయ జిల్లాల అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, ఉష శ్రీచరణ్, మాజీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్య, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గిరిజమ్మ, మేయర్ వసీం సలీం, ఆలూరు సాంబశివారెడ్డి, చిత్తూరు పార్లమెంట్ పరిశీలకులు చవ్వా రాజశేఖరరెడ్డి, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు తోపుదుర్తి చంద్ర శేఖర్‌రెడ్డి, తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి, తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి, తోపుదుర్తి నయనతారెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ బంధూక మధు, జిల్లా అధికార ప్రతినిథి చంద్రశేఖర్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, నరసింహారెడ్డి, పార్టీ ఆత్మకూరు మండల కన్వీనర్ బాలపోతన్న, బీసీ రమేష్ గౌడ్, చింతా సోమశేఖర్‌రెడ్డి, ఆలుమూరు సుబ్బారెడ్డి, రంగంపేట గోపాల్‌రెడ్డి, తిరుపాల్‌రెడ్డి, వీరాంజనేయులు, తలమర్ల సంజీవరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ఇస్మాయిల్, నగేష్‌రెడ్డి, హరీష్‌యాదవ్, డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, పుత్త ప్రతాప్‌రెడ్డి, మల్లన్న, కృష్ణానాయక్ , మాజీ ఎంపీటీసీ చిన్నా, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు.

తోపుదుర్తి భాస్కరరెడ్డికి కన్నీటి వీడ్కోలు