
కూలీల ఖర్చు కూడా గిట్టుబాటు కాదు
ప్యాపిలి మార్కెట్టులో దళారుల హవా నడుస్తోంది. గ్రేడింగ్ పేరుతో ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. 25 టమాట బాక్సులను మార్కెట్టుకు తీసుకెళితే.. 25 కిలోలు ఉన్న ఒక్కో బాక్సు రూ.30తో అడిగారు. ఆ ధరతో అమ్మితే కూలీల ఖర్చు కూడా గిట్టబాటు కాదు. తిరిగి కమీషన్ చెల్లించాలని ఒత్తిడి చేశారు. దీంతో విసుగు చెంది మార్కెట్‌లోనే పంటను పడేసి, ఖాళీ బాక్సులతో వెనుతిరిగి వచ్చా. రవాణా ఖర్చుతో పాటు కూలీల ఖర్చులూ భరించాల్చి వచ్చింది. అప్పుల భారం పెరిగింది.
– రామాంజనేయులు, రైతు, కొట్టాలపల్లి