
సెక్యూరిటీ గార్డు దుర్మరణం
తాడిపత్రి రూరల్: మండలంలోని బుగ్గ వద్ద నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డు మస్తాన్(50)పై లారీ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సోమవారం వేకువజామున ఈ ఘటన చోటు చేసుకుంది. సీఐ శివగంగాధర్‌రెడ్డి తెలిపిన మేరకు.. తాడిపత్రి పట్టణానికి చెందిన మస్తాన్.. హైవే సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుక్క వద్ద ఆదివారం రాత్రి విధులకు వెళ్లిన మస్తాన్ సోమవారం వేకువ జామున షెడ్‌లో నిద్రకు ఉపక్రమించాడు. అదే సమయంలో నంద్యాల నుంచి తాడిపత్రి వైపుగా వస్తున్న లారీ రేకుల షెడ్‌ను ఢీకొని దూసుకెళ్లింది. ఘటనలో మస్తాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాత్కాలిక బిషప్‌గా బెన్హర్‌బాబు
అనంతపురం కల్చరల్: సుదీర్ఘఽ చరిత్ర కల్గిన సీఎస్‌ఐ రాయలసీమ డయాసిస్ తాత్కాలిక బిషప్‌గా రెవరెండ్ బెన్హర్‌బాబు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా బిషప్ రెవరెండ్ డాక్టర్ పి.ఐజాక్ వరప్రసాదరెడ్డి టర్కీ వెళ్లిన నేపథ్యంలో రెవరెండ్ బెన్హర్‌బాబుకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం బాధ్యతలు స్వీకరించిన ఆయనను పాస్టర్లు మనుష్యే, మార్క్, జీఆర్ ఆనంద్, జహంగీర్, జాషువా, చార్లెస్ నాయక్ తదితరులు పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు.
రైల్వేస్టేషన్‌లో వృద్ధుడి మృతి
గుంతకల్లు: స్థానిక రైల్వేస్టేషన్‌లోని మూడో ప్లాట్‌ఫారంపై ఓ గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహాన్ని గుర్తించినట్లు జీఆర్‌పీ ఎస్‌ఐ మహేంద్ర తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 60 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి ప్లాట్ ఫారంలోని 22వ పోల్ వద్ద అనారోగ్యంతో మృతి చెందాడు. చామఛాయ రంగు కలిగి ఉన్నాడు. గడ్డం పెరిగి ఉంది. ఆచూకీ తెలిసిన వారు 98661 44616కు సమాచారం అందించాలని రైల్వే పోలీసులు కోరారు.
ప్రమాదంలో కర్ణాటక వాసి మృతి
రాయదుర్గం టౌన్: మిత్రులతో సరదాగా గడిపేందుకు వచ్చిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని దావణగెర జిల్లా తొలహునిసె గ్రామానికి చెందిన శివ (40) అవివాహితుడు. రాయదుర్గంలోని తన మిత్రులు రాము, మల్లికార్జునను కలిసేందుకు ఆదివారం మధ్యాహ్నం వచ్చాడు. అదే రోజు రాత్రి రాత్రి 10 గంటల సమయంలో వాల్మీకినగర్‌లోని మిట్టపై రోడ్డు దాటుతున్న శివను రాయదుర్గం నుంచి మెచ్చిరి గ్రామానికి ద్విచక్రవాహనంపై వెళుతున్న భాస్కర్, కృష్ణ ఢీకొన్నారు. ఘటనలో గాయపడిన ముగ్గురినీ స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక శివ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పురాతన నగరేశ్వరాలయంలో ఉబికి వస్తున్న నీరు
గుత్తి: పట్టణంలోని కోట ముఖ ద్వారం వద్ద ఉన్న పురాతన నగరేశ్వరాలయ గర్భగుడిలో నీరు ఉబికి వస్తోంది. గత 15 రోజులుగా నీరు ఉబికి వస్తుండడంతో మోటార్ల సాయంతో పంపింగ్ చేస్తున్నారు.
ఉత్సాహంగా జిల్లా స్థాయి సెపక్ తక్రా పోటీలు
ఉరవకొండ రూరల్: మండలంలోని నింబగల్లు జెడ్పీహెచ్‌ఎస్ క్రీడా మైదానంలో ఆ గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో సోమవారం జిల్లాస్థాయి బాలబాలికల సెపక్ తక్రా పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన 12 జట్లు పాల్గొన్నాయి. ఎంఈఓ ఈశ్వరప్ప ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలకు సీసీ కెమెరాలను పూర్వ విద్యార్థులు వితరణ చేశారు.కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

సెక్యూరిటీ గార్డు దుర్మరణం

సెక్యూరిటీ గార్డు దుర్మరణం

సెక్యూరిటీ గార్డు దుర్మరణం

సెక్యూరిటీ గార్డు దుర్మరణం

సెక్యూరిటీ గార్డు దుర్మరణం