
ఇమామ్, మౌజన్‌లకు దగా
అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వంలో ఇమామ్, మౌజన్‌లు దగా పడ్డారని వైఎస్సార్‌సీపీ మైనారిటీ విభాగం నాయకులు ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే ప్రతి నెలా ఇమామ్‌లకు రూ.10వేలు, మౌజన్‌లకు రూ.5వేలు గౌరవ వేతనం ఇస్తామంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు విస్మరించారని మండిపడ్డారు. 11 నెలలుగా గౌరవేతనం కూడా ఇవ్వకుండా అన్యాయం చేస్తోందన్నారు. తక్షణం పెండింగ్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు మొఘల్ సైఫుల్లా బేగ్ అధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట మైనారిటీ నాయకులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. సైఫుల్లాబేగ్‌తో పాటు ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ నదీమ్ అహమ్మద్, మేయర్ వసీం సలీమ్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఫయాజ్‌బాషా, రాష్ట్ర మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శి కాగజ్‌ఘర రిజ్వాన్ మాట్లాడారు. ముస్లిం మైనారిటీల విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. ఇమామ్, మౌజన్‌లకు 11 నెలలుగా గౌరవ వేతనం ఇవ్వకుండా నిలిపివేశారన్నారు. దీంతో మత పెద్దలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం గౌరవ వేతనం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్‌ఓ ఎ.మలోలను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు అబుసలేహా, ఇషాక్, రహంతుల్లా, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ మైనారిటీ నాయకులు గౌస్‌బేగ్, వేముల నదీమ్, కొర్రపాడు హుసేన్ పీరా, మన్సూర్‌బాషా, ఆసిఫ్, ఖాజా, మహబూబ్‌బాషా, ఖమర్‌తాజ్, షేక్ జావీద్, ఖాదర్‌బాషా, రియాజ్, అంజాద్ ఖాన్, జిలాన్, ఖాజాపీర్, షకీల్, దాదాపీర్, సాదిక్, సలాం, అన్సర్, హుసేన్, మీరన్‌బాషా, ఎంఏ జిలాన్, శర్మాస్, షమీ, రియాజ్, అమ్రుల్లా, అఫ్రోజ్, అప్జల్, షేక్షావలి, దాదు, ఇబ్రహీం, జాకీర్, ఖాసీం, అబ్దుల్ రెహమాన్, చాంద్‌బాషా, ఎండీఆర్ ఖలీల్, నూర్ నిజామీ, ఫ్లయింగ్ మాబూ, కరీమ్‌ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చిన హామీని విస్మరించిన
సీఎం చంద్రబాబు
11 నెలలుగా గౌరవవేతనమూ నిలిపివేత
కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్‌సీపీ
మైనారిటీ విభాగం ధర్నా