
విశ్రాంత గురువులను సన్మానించిన వైఎస్సార్‌టీఏ
అనంతపురం ఎడ్యుకేషన్: సుదీర్ఘకాలం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ తమ బోధనతో ఎంతోమంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దిన గురువులను గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. స్థానిక ఉపాధ్యాయ భవనంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సన్మానం పొందిన వారిలో రిటైర్డ్ హెచ్‌ఎం ఆర్.సీతారామారావు, రిటైర్డ్ ఉపాధ్యాయులు ఆర్.కాంతయ్య, ఎ.రామచంద్రయ్య, ఎం.రోగప్ప, జి.రామదాసు, జి.రామ్మోహన్‌రెడ్డి, ఎంసీ సుధాకిరణ్ ఉన్నారు. కార్యక్రమంలో పీడీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కూరపాటి నరసింహారెడ్డి, వైఎస్సార్‌టీఏ జిల్లా అధ్యక్షుడు ఎస్.నాగిరెడ్డి, రాష్ట్ర, జిల్లా నాయకులు గోవిందరెడ్డి, రవీంద్రారెడ్డి, సిద్ధప్రసాద్, వెంకటరెడ్డి, రాధాకృష్ణారెడ్డి, ఓబిరెడ్డి, విశ్వనాథరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, రామకృష్ణ, గోపాల్ పాల్గొన్నారు.