
జిల్లాస్థాయిలో 76 మంది ఉత్తమ గురువులు
అనంతపురం ఎడ్యుకేషన్: పాఠశాల విద్యారంగంలో విశిష్ట సేవలందిస్తున్న 76 మందిని ఈ విద్యా సంవత్సరం జిల్లాస్థాయిలో ఉత్తమ సేవా అవార్డులకు ఎంపిక చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు అనంతపురంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల డ్రామా హాలులో జరిగే ‘గురు పూజోత్సవ వేడుక’ల్లో వీరికి అవార్డులు అందజేయనున్నారు. ఎంపిక జాబితాను గురువారం సాయంత్రం విద్యాశాఖ విడుదల చేసింది. అవార్డులు అందుకునే వారిలో అనంతపురంలోని జీహెచ్‌ఎస్ నం.–2 పనిచేస్తున్న ఎస్.నవీద, కె.శ్రీనివాసులురెడ్డి, 15 వార్డులోని పాఠశాల ఉపాధ్యాయుడు అశోక్‌నాయక్, ఎస్‌ఎస్‌బీఎన్‌లో పనిచేస్తున్న ఎం.నాగరాజు, నందమూరి నగర్ ఎంపీపీఎస్ ఉపాధ్యాయుడు జి.నారాయణస్వామి, కేఎస్‌ఆర్ స్కూల్ టీచర్ ఎం.శ్రీదేవి, పాపంపేటలో పని చేస్తున్న టీఎం వెంకటేశులు, బి.గీతాలక్ష్మి, కె.పండరీనాథ్ (74 ఉడేగోళం), ఈ.వేణుగోపాల్ (కొనకొండ్ల), కె.సోమశేఖర్ (రామసాగరం), ఎన్.ఆదిశంకర్ (నేత్రాపల్లి), ఎ.వెంకటేశులు (పాలవాయి), సీకే సుబ్రహ్మణ్యం (గోనబావి), ఎన్.సుధ (అబ్బేదొడ్డి), ఎం.డానియల్ (రాయలచెరువు), సర్వమంగల (పాల్తూరు), జి.శ్రీనివాసులు (కళ్యాణదుర్గం), వాణిశ్రీ చూడామణి (ఉప్పరహాళ్), ఎం.సాయిలీల (బొమ్మనహాళ్), సుశీల(చౌళూరు), ఎం.సిద్ధేశ్వరస్వామి (కంబదూరు), కె.రవీంద్ర (హనకనహాళ్), కె.శ్రీధర (గంగలాపురం), బి.సూరిబాబు (యలగలవంక), జి.రఘురాం (యలగలవంక), ఎన్.కృష్ణమోహన్‌రెడ్డి (పి.వెంగన్నపల్లి), ఎ.వెంకటజయశంకర్ (కొట్టాలపల్లి), జె.వెంకోబరావు (పూలకుర్తి), జేకే శివశరణరప్ప (ఆవులదట్ల), పి.నందకుమార్ (ముట్టాల), ఎస్.రవీంద్ర (పెద్ద యక్కలూరు), టి.రజనీకుమారి (చిన్నహోతూరు), జి.విజయమేరీ (చిత్రచేడు), ఆర్.తులసీనాయక్ (రామసాగరం), ఎస్‌ఆర్ రాజమణి (వెస్ట్ నరసాపురం), పి.సునీత (బి.యాలేరు), కేఆర్ సునీత (హొసగుడ్డం), వీణ కాళిదాసరాజు (గోనెహాళ్), ఈ.మాధవి ఎడ్వర్డ్స్ (పాతకొత్తచెరువు), కె.సరిత (హనకనహాళ్), జె.సూర్యనారాయణ (బెస్తరపల్లి), డి.అగస్టీన్ కుమార్ (తాడిపత్రి), ఎం.కళాసుధాకర్‌రావు (కొనకొండ్ల), కె.హెప్సి సరోజ (గుత్తి), యూ.కోటప్ప (అంకంపల్లి), ఎం.జయరాముడు(ఆకులేడు), బి.సరహ్‌సుజన్ (పూలకుంట), కె.కృష్ణమూర్తి (చెన్నంపల్లి), ఎ.పవన్‌కుమార్ (ఉద్దేహాళ్), ఎం.హరినాథ్ (హవళిగి), పి.లక్ష్మన్న (రాప్తాడు), పి.శివప్రసాద్‌నాయుడు (ఊబిచెర్ల), పి.వేణుగోపాల్ (గోనబావి), జి.చిత్తయ్య (కళ్యాణదుర్గం), ఎ.ప్రభావతి (పాతకొత్తచెరువు), ఎం.చంద్రశేఖర్ (రాకెట్ల), ఆర్సీ అక్కులప్ప (కూడేరు), ఎ.శ్రీరాములు (గోపులాపురం), పి.వజీర్‌బాషా (కోనంపల్లి), ఎన్.సరళ (రామరాజుపల్లి), వి.మారెన్న (ఎన్.గుండ్లపల్లి), బి.నాగలక్ష్మి (కొండాపురం), యూ.శ్రీనివాసులు (యలగలవంక), వైకేఎల్ రంగమ్మ (నెలగొండ), పి.సరస్వతి (దుద్దేకుంట), ఎన్.వినీత (మానిరేవు), పి.రాధ (గొల్లలదొడ్డి), కె.శ్రీదేవి (దుద్దేకుంట), ఎస్.ఆశా (గార్లదిన్నె), ఎ.అర్జున్ (హనిమిరెడ్డిపల్లి), కె.వన్నప్ప (జె.కొట్టాల), ఎం.వెంకటాచలపతి (చింతకాయమంద), ఎస్.మహేష్‌కుమార్ (కేకే తండా), ఎల్.రాజేశ్వరి (అనంతసాగర్‌కాలనీ), సీహెచ్ బాలగోవిందు (వెంకటాపురం) ఉన్నారు.
నేడు అవార్డుల అందజేత
ఉదయం 10 గంటలకు ఆర్ట్స్ కళాశాల డ్రామా హాలులో వేడుకలు