
‘అనంత’ను కరువు ఛాయలు కమ్మేస్తున్నాయి. రైతులను మరోసారి ఈ
దిగాలుగా
ఆకాశం వైపు
చూస్తున్న రైతు
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాను ఈ సారి నైరుతి రుతుపవనాలు ముందస్తుగానే పలకరించినా ఏ మాత్రమూ ప్రభావం చూపడం లేదు. ‘నైరుతి’ ప్రవేశానికి ముందు ఏప్రిల్, మే నెలల్లో అకాల వర్షాలు కురిశాయి. ఏప్రిల్‌లో 12.1 మి.మీ గానూ నాలుగింతలు అధికంగా 56.3 మి.మీ, మేలో 36.7 మి.మీ గానూ ఏకంగా 101.3 మి.మీ వర్షపాతం నమోదైంది. తీరా జూన్‌లో ఖరీఫ్ మొదలయ్యేనాటికి వరుణుడు ముఖం చాటేశాడు. జూన్ 8, 12 తేదీల్లో మాత్రమే మోస్తరు వర్షపాతం నమోదైంది. జూన్ ముగిసేనాటికి 61.2 మి.మీ గానూ 21.7 శాతం తక్కువగా 47.9 మి.మీ వర్షం పడింది. పంటలు విత్తుకునేందుకు కీలకమైన జూలైలో వాన కోసం ఎదురుచూసినా ఫలితం కనిపించలేదు. జూలైలో 64.3 మి.మీ గానూ 46.4 శాతం తక్కువగా కేవలం 34.7 మి.మీ వర్షం కురిసింది. మొత్తమ్మీద 131.1 మి.మీ గానూ ప్రస్తుతానికి 37 శాతం లోటు వర్షపాతంతో 82.7 మి.మీ నమోదైంది. ఒక మండలంలో మాత్రమే సాధారణం కన్నా అధిక వర్షం కురిసింది. 7 మండలాల్లో సాధారణం నమోదు కాగా మిగతా 24 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సీజన్ మొదట్లోనే సుదీర్ఘ వర్షపాత విరామాలు (డ్రైస్పెల్స్) నమోదు కావడం కరువు పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.
అడపాదడపా కురిసిన వర్షాలకే విధి లేని పరిస్థితుల్లో రైతులు పంటలు వేశారు. అలా సాగు చేసిన పంటలు ప్రస్తుతం ఎండుముఖం పడుతున్నాయి. ఈ ఖరీఫ్‌లో 3.42 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి వస్తాయని అధికారులు అంచనా వేశారు. కానీ జూన్ 15 నుంచి నైరుతి నిరాశపర్చడంతో ప్రధాన పంటలు విత్తుకునే సమయం ముగిసేనాటికి అంటే జూలై ఆఖరుకు 40 శాతం విస్తీర్ణంతో 1.35 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగులోకి వచ్చాయి. ఇంకా 60 శాతం భూములు బీళ్లుగానే దర్శనమిస్తున్నాయి. ఇక.. మిగిలిన సుమారు 2 లక్షల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం కష్టమని రైతులు వాపోతున్నారు. గత నాలుగు దశాబ్దాల జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రధానపంట వేరుశనగ 1.82 లక్షల హెక్టార్లకు గానూ ప్రస్తుతానికి 47 వేల హెక్టార్లకు పరిమిత మైంది. మరో ప్రధానపంట కంది 49 వేల హెక్టార్లు, 44 వేల హెక్టార్లకు గానూ పత్తి 14 వేల హెక్టార్ల వద్ద ఆగిపోయింది. ఆముదం 17 వేల హెక్టార్లకు గానూ 6,300 హెక్టార్లు, మొక్కజొన్న 15 వేల హెక్టార్లకు గానూ 10,500 హెక్టార్లు, సజ్జ 2,500 హెక్టార్లు, పొద్దుతిరుగుడు 500 హెక్టార్లు, కొర్ర 200 హెక్టార్లలో సాగులోకి వచ్చాయి. పెద్దవడుగూరు మండలంలో 66 శాతం లోటు వర్షపాతం నమోదు కావడం పత్తి సాగుపై తీవ్ర ప్రభావం చూపింది. నెలల తరబడి వర్షాలు కురవకపోవడంతో సాగు చేసిన వేరుశనగ, కంది, పత్తి, ఆముదం తదితర పంటలు చాలా ప్రాంతాల్లో వాడుముఖం పట్టగా మరికొన్ని ప్రాంతాల్లో ఎండిపోతున్న పరిస్థితి నెలకొంది. ఇదే పరిస్థితి వారం పది రోజులు కొనసాగితే మునుపెన్నడూ లేని విధంగా కరువు కాటు తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
గతంలో కూడా చంద్రబాబు పాలనలో వరుస కరువులు విలయతాండవం చేశాయి. అప్పట్లో ఒక్కోసారి అకాల వర్షాలు, మరోసారి అసలు వర్షాలే కురవకుండా పంటలను తీవ్రంగా దెబ్బతీశాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నేడు కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
రక్కసి కోరల్లోకి అన్నదాతలు
సీజన్ ముగిసినా 40 శాతం
విస్తీర్ణంలోనే పంటల సాగు
వర్షాలు లేక ఆ పంటలూ
ఎండుముఖం
‘చంద్రబాబు–కరువు కవలలు’
అంశంపై మళ్లీ చర్చ
ఎండుతున్న పంటలు..
సర్వత్రా చర్చనీయాంశం..

‘అనంత’ను కరువు ఛాయలు కమ్మేస్తున్నాయి. రైతులను మరోసారి ఈ

‘అనంత’ను కరువు ఛాయలు కమ్మేస్తున్నాయి. రైతులను మరోసారి ఈ