
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
● జిల్లా స్థాయి యోగా పోటీల ప్రారంభోత్సవంలో
గవిమఠం ఉత్తరాధికారి
ఉరవకొండ: సంపూర్ణ ఆరోగ్యంతో పాటు పరిపూర్ణ జీవన విధానానికి యోగ అత్యంత ఆవశ్యమని గవిమఠం ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్రస్వామి అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రభుత్వ సెంట్రల్ ఉన్నత పాఠశాల ఆవరణలో కేంద్ర క్రీడలు, యువజన విభాగ శాఖ సౌజన్యంతో ఏపీ యోగాసాన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్వర్యంలో 5వ జిల్లా స్థాయి యోగాసన చాంపియన్ షిప్ పోటీలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా నలమూలల నుంచి 240 మంది యోగా సాధకులు పాల్గొన్నారు. పోటీలను మఠం ఉత్తరాధికారి జ్యోతి ప్రజల్వనతో ప్రారంభించి, మాట్లాడారు. పరిపూర్ణ జీవనశైలికి యోగా ఒక బాటగా నిలుస్తుందన్నారు. అనంతరం 10 నుంచి 28 ఏళ్ల లోపు ఉన్న వారికి ఏడు ఈవెంట్‌లతో పోటీలు నిర్వహించారు. జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకట్ తాటికొండ, ప్రధాన కార్యదర్శి మారుతీప్రసాద్, అబ్జర్వర్ బద్రీనాథ్, నాగభూషణ్, దివాకర్, ఆయూర్ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.