
నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ భవన్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో సమర్పించాలన్నారు. అర్జీతో పాటు ఫోన్, ఆధార్ నంబర్లు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. సమర్పించిన అర్జీల స్థితిని కాల్‌సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లోనూ అర్జీలు సమర్పించవచ్చని తెలియజేశారు.
13న జెడ్పీ
స్థాయీ సంఘ సమావేశాలు
అనంతపురం సిటీ: ఉభయ జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను ఈ నెల 13న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫైలును సిద్ధం చేసి చైర్‌పర్సన్ బోయ గిరి జమ్మకు పంపగా.. ఆమె పరిశీలించి ఆమోదం తెలిపారు. స్థాయీ సంఘం–1, 2, 4, 7(ఆర్థిక, ప్రణాళిక/గ్రామీణాభివృద్ధి/విద్య, వైద్యం/ ఇంజినీరింగ్ శాఖలు) సమావేశాలు ప్రధాన హాలులో జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన నిర్వహించనున్నారు. అదనపు సమావేశ భవన్‌లో స్థాయీ సంఘం–3, 5, 6(వ్యవసాయం/ఐసీడీఎస్/సాంఘిక సంక్షేమ శాఖలు) సమావేశాలు నిర్వహించనున్నారు. సీఈఓ శివశంకర్, డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య పర్యవేక్షణలో సమావేశాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే ఆయా శాఖల అధికారులకు పంపారు. జిల్లా స్థాయి అధికారులు కచ్చితంగా సమగ్ర సమాచారంతో హాజరుకావాలని పేర్కొన్నారు.
విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద రైతుల ధర్నా
బెళుగుప్ప: మండల పరిధిలోని గంగవరం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ఆదివారం రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల లో ఓల్టేజ్‌తో పాటు విద్యుత్ సరఫరాలో కోతలు అధికమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బోరుబావుల మోటార్లు సరిగా ఆడటం లేదని వాపోయారు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతు న్నాయని చెప్పారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరిస్తామని ఏఈ గంగాధర్ హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.

నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’

నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’