
ఇద్దరు బీటెక్ విద్యార్థుల దుర్మరణం
ముదిగుబ్బ/ కుందుర్పి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ ఘటనతో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. వివరాలిలా ఉన్నాయి. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బలోని నాయీబ్రాహ్మణ వీధికి చెందిన శ్రీనివాసులు కుమారుడు కార్తీక్ (23), అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మాయదార్లపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు వలస మూర్తి కుమారుడు రోహిత్ (23) తమిళనాడు రాష్ట్రం మధురైలోని కలసలింగం యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నారు. శుక్రవారం సాయంత్రం వీరిద్దరూ బైక్‌పై యూనివర్సిటీ సమీపంలో వెళ్తుండగా బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో కార్తీక్, రోహిత్ మృతి చెందారు. రోహిత్ జాతీయస్థాయి రెజ్లింగ్ క్రీడాకారుడు.

ఇద్దరు బీటెక్ విద్యార్థుల దుర్మరణం