
అపూర్వ స్నేహితులు
కొర్రపాడుకు చెందిన అక్కులప్ప, ఉరవకొండకు చెందిన తిమ్మారెడ్డిది అపూర్వమైన స్నేహబంధం. అనంతపురంలోని హైస్కూల్‌లో 6వ తరగతి చదివే సమయంలో ఇద్దరూ స్నేహితులయ్యారు. 30 ఏళ్లుగా వీరి స్నేహం చెక్కు చెదరలేదు. అక్కులప్ప పార్ట్‌టైం పీహెచ్‌డీ చేస్తూ, న్యాయవాది వృత్తిని ఎంచుకున్నారు. తిమ్మారెడ్డి ఐబీఎంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. చిన్నపాటి మనస్పర్ధలు కూడా లేకుండా వారి స్నేహాన్ని కొనసాగిస్తూ.. స్పూర్తిగా నిలుస్తున్నారు. ఎన్ని సమస్యలు ఉన్నా వీలైనప్పుడు ఇద్దరూ కలుస్తున్నారు. బాల్యంలో ఎలా ఉన్నారో.. ఇప్పుడు కూడా అదే సంతోషంగా సాగేలా కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారు. దైవదర్శనాలకు కలిసే వెళ్తున్నారు. ప్రతి పండుగనూ బంధువుల్లా చేసుకుంటామని ఇద్దరూ చెబుతున్నారు.

అపూర్వ స్నేహితులు