
స్నేహంలో అనుమానాలొద్దు
అనంతపురంలోని కాంట్రాక్ట్ ఉద్యోగి స్కైలాబ్ రెడ్డి, మల్లికార్జునరెడ్డిది 30 ఏళ్ల స్నేహం. ఏనాడూ చిన్న పట్టింపు లేకుండా వీరి స్నేహం సాగిపోతోందంటే చెప్పుడు మాటలు వినకపోవడం, ఒక వేళ వినాల్సి వచ్చినా ఏనాడూ ఆలోచించకుండా అడుగేసింది లేదు. ఇంట్లో వారందరినీ భగవంతుడే ఇచ్చాడు. మంచి స్నేహాన్ని తామే ఎంచుకోవాలన్న స్పృహతో ఉంటేనే ఏ బంధమైనా కలకాలం ఉంటుందంటున్నారు. సాధారణంగా చాలా స్నేహాలు ఈగోలతో, ఆర్థిక విషయాలలో చెడిపోతుంటాయని, అందరూ అటువంటి వాటికి దూరంగా ఉండాలని తెలిపారు. అప్పుడే స్నేహం వర్ధిల్లుతుంది.