
● వాన కురవక.. ఆశ చావక
పెద్దవడుగూరు మండలంలోని పెద్దవడుగూరు, లక్ష్ముంపల్లి, దిమ్మగుడి, చిన్నవడుగూరు గ్రామాల్లో చాలామంది రైతులు పత్తి, కొర్ర తదితర పంటలు సాగు చేశారు. అయితే, సరిగ్గా మొక్కలు మొలకెత్తాక వానలు కరువయ్యాయి. ఇటీవల మేఘాలు ఊరిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. దీంతో పంట ఎండుముఖం పట్టింది. వేల రూపాయలు ఖర్చు చేసి పెట్టిన పంట ఎండిపోతుండడాన్ని రైతులు తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో కొందరు రైతులు ఎలాగైనా పంటను బతికించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనంలో బిందెలతో నీటిని తీసుకెళ్లి మొక్కలకు పోస్తున్నారు. లక్ష్ముంపల్లి గ్రామం వద్ద ఓబుళరెడ్డి అనే రైతు తన పొలంలోని పత్తి మొక్కలకు నీటిని పోయిస్తుండగా తీసిన చిత్రమిది. – పెద్దవడుగూరు