
వేడుకగా చందన షాపింగ్ మాల్ ప్రారంభం
● సందడి చేసిన నిధి అగర్వాల్
అనంతపురం కార్పొరేషన్: నగరంలోని సూర్యనగర్ సర్కిల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన చందన షాపింగ్ మాల్‌ను ఆదివారం సినీనటి నిధి అగర్వాల్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చందన షాపింగ్ మాల్‌లో మెన్స్, ఉమెన్స్, కిడ్స్ వస్త్రాలు సరసమైన ధరలకు అందుబాటులో ఉంటాయన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ.. వస్త్ర వ్యాపారంలో వినియోగదారులతో చందన షాపింగ్ మాల్‌కు 40 ఏళ్ల అనుబంధముందన్నారు. ఈ క్రమంలో సరికొత్త రూపంలో చందన షాపింగ్ మాల్‌ను అనంతపురానికి తీసుకువచ్చామన్నారు. సొంత మగ్గాలతో నేయించిన చీరలను అందుబాటులో ఉంచామన్నారు. ప్రారంభం సందర్భంగా కొనుగోలుదారులకు ఆఫర్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక చీర కొంటే మరో చీరపై 99 శాతం తగ్గింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జెడ్పీ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, అర్బన్ బ్యాంక్ చైర్మన్ జేఎల్ మురళీధర్, నిర్వాహకులు ఎంవీ సంతోష్ రాంమోహన్, ఎంవీ గణేష్, తదితరులు పాల్గొన్నారు. కాగా, మాల్ ప్రారంభానికి విచ్చేసిన నిధి అగర్వాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సినీ పాటలకు స్టెప్పులు వేసి ప్రజలను అలరించారు.