
టన్ను చీనీ రూ.18 వేలు
అనంతపురం మార్కెట్ యార్డులో గురువారం టన్ను చీనీకాయలు గరిష్టంగా రూ.18 వేలు, కనిష్టం రూ.3 వేల ప్రకారం ధర పలికాయి.
రంగయ్య పర్యటనకు పోలీసుల అడ్డంకులు
కళ్యాణదుర్గం: చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలను వివరించేందుకు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య శెట్టూరులో ఏర్పాటు చేసిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. గురువారం ఉదయం రంగయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, పార్టీ నేత మాదినేని ఉమా మహేశ్వర నాయుడులు పార్టీ శ్రేణులతో కలిసి కళ్యాణదుర్గం నుంచి శెట్టూరుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే అప్పటికే ఎమ్మెల్యే ఆదేశాలతో సిద్ధంగా ఉన్న పోలీసులు వైఎస్సార్ సీపీ కార్యాలయానికి చేరుకుని రంగయ్యను హౌస్ అరెస్టు చేసేందుకు యత్నించారు. తాను ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే వెళ్తున్నానని రంగయ్య పోలీసులకు సమాధానమిచ్చారు. ఎమ్మెల్యే అమిలినేని కార్యక్రమం ఉందని బుకాయిస్తూ అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే శెట్టూరుకు వెళ్లేందుకు బయలుదేరుతుండగా రూరల్ సీఐ వంశీకృష్ణ తన సిబ్బందితో రంగయ్య వాహనాలను అడ్డుకున్నారు. పోలీసుల అత్యుత్సాహం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది.