
ప్రాణాలు బలిగొన్న చేపల వేట సరదా
గుమ్మఘట్ట: చేపల వేట సరదా ఇద్దరి ప్రాణాలు బలిగొంది. స్థానికులు తెలిపిన మేరకు.. రాయదుర్గం పట్టణానికి చెందిన మన్సూర్ బాషా (34), కర్ణాటకలోని రాంపుర గ్రామానికి చెందిన జబీవుల్లా (28) ఇద్దరూ మంచి స్నేహితులు. మన్సూర్‌బాషాకు భార్య టబూ, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. టైలరింగ్‌తో కుటుంబాన్ని పోషించుకునేవాడు. అలాగే జబీవుల్లాకు భార్య గుల్జార్‌భాను, ఇద్దరు కుమారులు ఉన్నారు. డ్రైవింగ్ పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. చేపల వేట అంటే ఎంతో ఆసక్తి ఉన్న ఇద్దరూ గురువారం గాలాలు తీసుకుని ద్విచక్ర వాహనంపై బీటీ ప్రాజెక్ట్‌కు చేరుకున్నారు. గాలం వేసే సమయంలో మన్సూర్‌బాషా నీటిలో పడిపోవడంతో కాపాడేందుకు తనకు ఈత రాకపోయినా జబీవుల్లా దిగాడు. లోతు ఎక్కువగా ఉండడంతో ఇద్దరూ నీట మునిగి పోయారు. శుక్రవారం ఉదయం నీటిలో మృతదేహాలు తేలియాడుతుండడం గమనించిన స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను వెలికి తీయించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
పీహెచ్‌సీలో తనిఖీలు
వజ్రకరూరు: స్థానిక పీహెచ్‌సీని జాతీయ ఆరోగ్యమిషన్ కార్యక్రమ అధికారి శ్రీనివాసరెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. రికార్డులు, వార్డులను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యాధికారి తేజశ్వి, సిబ్బంది పాల్గొన్నారు.