
పంటల బీమా ప్రీమియం చెల్లించండి
అనంతపురం సెంట్రల్: ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు నష్టపోకుండా 2025 సంవత్సరానికి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పునర్మించిన వాతావరణ పంటల బీమా (ఆర్‌డబ్ల్యూసీఐఎస్) పథకాలను అమలు చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ తెలిపారు. ఖరీఫ్‌లో సాగు చేసిన ఆహార, నూనె గింజల పంటలన్నింటికీ బీమా వర్తిస్తుందన్నారు. ఖరీఫ్‌లో ప్రీమియం 2 శాతం, రబీ కాలంలో ప్రీమియం 1.5 శాతం మాత్రమే రైతులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. వాణిజ్య ఉద్యాన పంటలకు 5 శాతం ప్రీమియం చెల్లించాలన్నారు. రైతు కట్టగా మిగిలిన ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సగం సగం చొప్పున భరిస్తాయని పేర్కొన్నారు. దిగుబడి ఆధారంగా కంది పంటను గ్రామం యూనిట్‌గా, వరి జొన్న, మొక్కజొన్న, ఆముదం, ఎండు మిరప పంటలను మండలం యూనిట్‌గా పరిగణిస్తారని తెలిపారు. వేరుశనగ, పత్తి, ఉద్యాన పంటలైన దానిమ్మ, బత్తాయి, టమోట, అరటి పంటలకు మండలాన్ని యూనిట్‌గా తీసుకొని వాతావరణ బీమాను లెక్కిస్తారని చెప్పారు. కంది పంటకు హెక్టారుకు రూ.200, వరికి రూ.410, జొన్నకు రూ.210, మొక్కజొన్నకు రూ.330, ఆముదంకు రూ.200, ఎండు మిరప రూ.1400 చెల్లించాలన్నారు. అలాగే రైతులు వేరుశనగకు హెక్టారుకు రూ.1600, పత్తి రూ.1600, దానిమ్మకు రూ.9,375, చీనీకి రూ. 6,875, టమాట రూ.4 వేలు, అరటికి హెక్టారుకు రూ.7,500 చెల్లించాల్సి ఉంటుందన్నారు.
వ్యక్తిపై హత్యాయత్నం
బొమ్మనహాళ్: మండలంలోని మైలాపురంలో కొలనగాహళ్లికి చెందిన అనంతరాజు అనే వ్యక్తిపై సోమవారం రాత్రి హత్యాయత్నం జరిగింది. గ్రామస్తుల వివరాలమేరకు.. అనంతరాజు మైలాపురానికి సోమవారం రాత్రి వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన లోకేష్, విజయ్.. అనంతరాజు బైక్‌ను ధ్వంసం చేసి అతనిపైనా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అనంతరాజును బళ్లారి విమ్స్‌కు తరలించారు. పరిస్ధితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే బాధితుని బంధువులు మైలాపురానికి చేరుకోవడంలో ఉద్రిక్తత నెలకొంది. లోకేష్, విజయ్‌ల ఇళ్లలోకి వెళ్లి తలుపులు, టీవీ, సామగ్రిని పగలకొట్టి, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక కారును ధ్వంసం చేసి గడ్డివాముకు నిప్పు పెట్టారు. పోలీసులు గ్రామంలో పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహిస్తున్నారు. వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
బత్తలపల్లిలో
పీర్ల భేటీ
తిలకించేందుకు
విచ్చేసిన ప్రజలు
బత్తలపల్లిలో పీర్ల భేటీ
● నలుమూలల నుంచి తరలివచ్చిన జనం
● పీర్ల భేటీని తిలకించి పరవశించిన వైనం