
నీట్‌లో ప్రతిభ
అనంతపురం: నీట్ (నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ )– 2025 రాష్ట్రస్థాయి ర్యాంకులు సోమవారం ప్రకటించారు. అనంతపురం నగరానికి చెందిన సునీత, బిక్షంరెడ్డి దంపతుల కుమారుడు బానాల చేతన్‌రెడ్డి నీట్‌లో గణనీయమైన ర్యాంకు సాధించాడు. జాతీయస్థాయిలో 1615వ ర్యాంకు, స్టేట్ ర్యాంకు 83 దక్కించుకున్నాడు. మంచి ర్యాంకు సాధించిన చేతన్‌రెడ్డిని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అభినందించారు. తల్లిదండ్రుల సహకారంతోనే నీట్‌లో రాణించినట్లు చేతన్‌రెడ్డి తెలిపారు. అలాగే అనంతపురం నగరానికి చెందిన సురేష్, పద్మ సువర్ణ దంపతుల కుమారుడు అవ్వా సాయి వంశీ నీట్‌లో జాతీయస్థాయి 3,780వ ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 170వ ర్యాంకు సాధించారు. సురేష్ అనంతపురంలో సీనియర్ న్యాయవాది. డాక్టర్ పద్మ సువర్ణ జేఎన్‌టీయూ అనంతపురంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మంచి డాక్టర్‌గా పేరు ప్రఖ్యాతలు సంపాదించాలన్నదే తన లక్ష్యమని సాయి వంశీ తెలిపారు.

నీట్‌లో ప్రతిభ