
34 ఏళ్ల తర్వాత భేటీకి వచ్చిన పీర్లు
మొహర్రం ఉత్సవాల్లో 34 ఏళ్ల తర్వాత ధర్మవరం మండలం మల్కాపురం పీర్లు భేటీ కోసం బత్తలపల్లికి వచ్చాయి. గతంలో మండలంలోని 24 గ్రామాల పీర్లు వెంకటగారిపల్లి సత్రం వద్ద భేఠీ అయ్యేవి. 1992లో అక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవడం వల్ల భేటీకి కొన్ని గ్రామాల పీర్లు వెళ్లడం లేదు. అప్పటి నుంచి మల్కాపురం పీర్లు కూడా భేటీకి వెళ్లడం లేదు. ఇప్పడు బత్తలపల్లి కూడలిలో సోమవారం జరిగిన భేటీకి ఆ గ్రామానికి చెందిన పీర్లు రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. మల్కాపురంలో గ్రామోత్సవం అనంతరం పోట్లమర్రికి చేరుకున్న పీర్లకు ఇక్కడ పీర్లు ఘనస్వాగతం పలికి భేటీ తీసుకున్నారు. అక్కడ నుంచి బత్తలపల్లి కూడలికి రెండు గ్రామాలకు చెందిన పీర్లు తరలివచ్చాయి.