
ఘనంగా మన్రో వర్ధంతి
గుత్తి: దత్త మండలాల కలెక్టర్ సర్ థామస్ మన్రో 198వ వర్ధంతిని గుత్తి కోట సంరక్షణ సమితి , మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కోట వీధిలో ఉన్న సర్ థామస్ మన్రో సమాధిపై పూలు చల్లి నివాళులర్పించారు. గుత్తి కోట సంరక్షణ సమితి అధ్యక్షుడు విజయభాస్కర్, గైడ్ రమేష్ మాట్లాడుతూ.. సర్ థామస్ మన్రో సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ మహబూబ్‌బాషా, కళాకారుడు విజయకుమార్, కోట సంరక్షణ సమితి ఉపాధ్యక్షుడు సుధాకర్ నాయుడు, సభ్యులు దస్తగిరి, నిజాం, జిలాన్, నరసింహ పాల్గొన్నారు.
జిల్లా స్థాయి యోగా పోటీలకు వేదిక కానున్న ఉరవకొండ
ఉరవకొండ: జిల్లా స్థాయి యోగా పోటీలకు ఉరవకొండ వేదిక కానుంది. ఈ పోటీల నిర్వహణకు సంబంధించి స్థానిక మార్కండేయ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఆయూష్ కార్యాలయంలో యోగా గురువులు, ఆయూష్ ప్రతినిధులు ఆదివారం సమావేశమై చర్చించారు. అనంతరం స్థానిక ఆయూస్ ప్రతినిధులు వెంకట్ తాడికొండ, సుధాకర్‌రెడ్డి, నాగమల్లి ఓబులేసు, అనంతపురం ప్రతినిధులు రాజశేఖరరెడ్డి, దివాకర్, మారుతీ ప్రసాద్ మాట్లాడుతూ.. ఆగస్టు 3న ఉరవకొండలో జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అసోసియేషన్ ఆఫ్ యోగ ఇన్ ఉరవకొండ వారి సహకారంతో సిలబస్ ఆధారంగా యోగాసన, రిథమిక్, యోగ, ఆర్టిస్టిక్‌పై పోటీలు నిర్వహిస్తామన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికై న వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతామని పేర్కొన్నారు.

ఘనంగా మన్రో వర్ధంతి