
●అ‘పూర్వ’ కలయిక
నాటి గురువులతో పూర్వ విద్యార్థులు
యాడికి: స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌లో 1979–80లో పదో తరగతి చదువుకున్న వారు అదే పాఠశాల వేదికగా ఆదివారం కలుసుకున్నారు. 6 నుంచి 10వ తరగతి వరకూ కలసి చదువుకున్న వీరు... తమ తరగతి గదులను ఆప్యాయంగా తాకుతూ తన్మయత్వంతో మురిసిపోయారు. వివిధ ప్రాంతాల్లో స్థిర పడిన వారందరూ 46ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కుటుంబ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యాబుద్దులు నేర్పిన నాటి గురువులు విజయభాస్కర రెడ్డి, సుబ్బారెడ్డి, కేశవరెడ్డిను ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు చవ్వా గోపాలరెడ్డి, సారెడ్డి రామశేఖరరెడ్డి, మల్లారెడ్డి, ధ్రువనారాయణ, ఈశ్వరప్ప, సాధు శేఖర్ తదితరులు నేతృత్వం వహించారు.