
● భిక్షమెత్తితేనే భుక్తి
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సొంత ఇలాకాలోని ఓ దివ్యాంగుడు పింఛన్ అందక భిక్షమెత్తుకుని పొట్ట పోసుకుంటున్నాడు. హిందూపురానికి చెందిన రేణుక రాజు దివ్యాంగుడు. గత ప్రభుత్వంలో పింఛన్ వచ్చేది. కొత్త ప్రభుత్వంలో పింఛన్ మరింత పెరుగుతుందనుకున్నాడు. అయితే ఇందుకు విరుద్ధంగా పింఛన్ జాబితా నుంచి ఆయన పేరు కనుమరుగైంది. అధికారులను బతిమాలుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో కొన్ని నెలలుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంచరిస్తూ భిక్షమెత్తుకుంటున్నాడు. శుక్రవారం గూగూడు కుళ్లాయి స్వామి ఉత్సవాల్లో ఈ దృశ్యం చూపరులను కలిచివేసింది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం: