
ఈఎన్‌టీలో తప్పని రోగుల నిరీక్షణ
అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని ఈఎన్‌టీ విభాగంలో చికిత్స కోసం రోగులు నాలుగు గంటలకు పైగా వేచి ఉండాల్సి వస్తోంది. మంగళవారం ఉదయం 8 గంటలకు ఆస్పత్రికి వచ్చిన రోగులు ఓపీ కోసం గంట పాటు బారులు తీరారు. ఆ తర్వాత ఈఎన్‌టీ విభాగానికి 9 గంటలకు చేరుకుని 12 గంటల వరకు వేచి ఉన్నా వైద్య నిపుణుడి పత్తా లేకుండా పోయింది. వైద్య విద్యార్థులు (పీజీ) ఓపీ చూసుకుని తీరిగ్గా 12 గంటల తర్వాత చికిత్స మొదలు పెట్టారు. దీంతో చెవి పోటు తీవ్రమై రోగులు నీరసించిపోయారు.
నొప్పి అంటున్నా పట్టించుకోలేదు
మా ఆదెమ్మ చెవి నొప్పితో బాధపడుతుంటే ఉదయం 9 గంటలకు ఆస్పత్రికి వచ్చాం. ఓపీలో పరీక్షించి గదిలో కూర్చొమన్నారు. ఎంత సేపటికీ డాక్టర్లు రారు. చెవి నొప్పి అంటూ ఆదెమ్మ విలవిల్లాడుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ప్రభుత్వాస్పత్రిలో మరీ ఇంత అద్వానంగా వైద్యం చేస్తారనుకోలేదు. పేదలంటే ఇంత చులకన అనుకోలేదు.
– వెంకటరాముడు, వెంకటాపురం
నీరసించిపోయా
చెవిలో సమస్య ఉందని పొద్దున్నే వచ్చా. ఇక్కడ చూస్తే ఓపీ చూసేందుకు గంటల సమయం పట్టింది. కుర్చీల్లో డాక్టర్లు లేరు. చివరకు జూనియర్ డాక్టర్లు వచ్చి చెవి చెక్ చేసి వెళ్లారు. తిరిగి ఎవరూ పట్టించుకోలేదు. ఎదురు చూసి నీరసించిపోయా.
– చెన్నకేశవులు, అనంతపురం

ఈఎన్‌టీలో తప్పని రోగుల నిరీక్షణ

ఈఎన్‌టీలో తప్పని రోగుల నిరీక్షణ