హెచ్చెల్సీ ఎస్‌ఈగా పురార్థనరెడ్డి బాధ్యతలు
అనంతపురం సెంట్రల్: హెచ్చెల్సీ ఎస్‌ఈగా పురార్థనరెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. నంద్యాల జిల్లా ఎస్‌ఆర్‌బీసీ ప్రాజెక్టు సర్కిల్–1 ఎస్‌ఈగా పనిచేస్తున్న ఆయనకు హెచ్చెల్సీ ఎస్‌ఈ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. నూతన ఎస్‌ఈకు హెచ్చెల్సీ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలియజేశారు.
అదృశ్యమైన మహిళలు
ఉరవకొండలో ప్రత్యక్షం
ఉరవకొండ: కళ్యాణదుర్గం పట్టణంలోని పార్వతీనగర్‌లో ఉన్న ఉజ్వల హోం నుంచి ఈనెల 22న అదృశ్యమైన ఇద్దరు మహిళల ఆచూకీ లభించింది. ఉరవకొండ అర్బన్ సీఐ మహానంది వివరాల మేరకు.. కుందుర్పి, కణేకల్లు మండలాలకు చెందిన యువతులు కళ్యాణదుర్గంలోని ఉజ్వల హోం నుంచి అదృశ్యమైనట్లు సోషల్ మీడియాలో పోస్టు చేశామన్నారు. ఉరవకొండ బస్టాండ్‌లో వారిని స్థానికులు గుర్తించి తమకు సమాచారం ఇచ్చారని తెలిపారు. వెంటనే వారిని కళ్యాణదుర్గం పోలీసులకు అప్పగించామన్నారు.
డ్రైవర్ దుర్మరణం
విడపనకల్లు: మండల పరిధిలోని హంచనహాల్ సమీపంలోని 67వ జాతీయ రహదారిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ ఈరన్న (42) మృతి చెందాడు. కర్ణాటకలోని కంప్లీ నుంచి గుంతకల్లు వైపు వెళ్తున్న లారీ మండల పరిధిలోని హంచనహాల్ సమీపంలోకి రాగానే టైర్ పంక్చర్ కావడంతో డ్రైవర్ లారీని ఆపీ టైరు కింద రాళ్ళను పెట్టేందుకు వెనుక వైపునకు వెళ్ళాడు. అదే సమయంలో గుంతకల్లు వైపు నుంచి వస్తున్న లారీ వేగంగా వచ్చి పంక్చరైన లారీని ఢీకొట్టింది. ఘటనలో డ్రైవర్ ఈరన్న అక్కడికక్కడే చనిపోయాడు.
హెచ్చెల్సీ ఎస్‌ఈగా పురార్థనరెడ్డి బాధ్యతలు


