వేరుశనగకు పంట రుణం రూ.38 వేలు | - | Sakshi
Sakshi News home page

వేరుశనగకు పంట రుణం రూ.38 వేలు

Apr 17 2025 12:37 AM | Updated on Apr 17 2025 12:37 AM

వేరుశనగకు పంట రుణం రూ.38 వేలు

వేరుశనగకు పంట రుణం రూ.38 వేలు

అనంతపురం అగ్రికల్చర్‌: ఈ ఏడాది వేరుశనగ పంటకు సంబంధించి ఎకరాకు రూ.38 వేల ప్రకారం రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు ఆదేశాలు అందాయి. ఖరీఫ్‌, రబీలో పంటల వారీగా రైతులకు ఎంత మొత్తంలో రుణాలివ్వాలనే అంశంపై గరిష్ట రుణ పరిమితి (స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌) ఖరారైనట్లు బ్యాంకర్లు తెలిపారు. గతేడాది కన్నా పంట పెట్టుబడులను బట్టి 10 నుంచి 20 శాతం రుణ పరిమితి పెంచారు. జిల్లాలోని బ్యాంకుల్లో రైతులకు సంబంధించి ఖరీఫ్‌ పంట రుణాల రెన్యువల్స్‌, కొత్త రుణాల పంపిణీ ప్రారంభమైనట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌కు అదనంగా 15 శాతం అధికంగా ఇచ్చే వెసులుబాటు కల్పించినట్లు సమాచారం.

పంటల వారీగా ఇలా:

వర్షాధారంగా సాగు చేసే వేరుశనగ ఎకరాకు రూ.38 వేలు, నీటి వసతి కింద అయితే రూ.41 వేల ప్రకారం రుణం ఇవ్వనున్నారు. కంది పంట వర్షాధారంగా ఎకరాకు రూ.29 వేలు, నీటి వసతి కింద రూ.30 వేలు, ఆముదం రూ.22 వేలు, పప్పుశనగ రూ.37 వేలు, పత్తి రూ.51 వేలు– 55 వేలు, విత్తనోత్పత్తి పత్తి రూ.1.60 లక్షలు, వరి రూ.52 వేలు, విత్తన వరి రూ.55 వేలు, జొన్న రూ.25 వేలు, రాగి రూ.22 వేలు– 25 వేలు, సజ్జ రూ.21 వేలు– 24 వేలు, కొర్ర రూ.17 వేలు– 21 వేలు, వర్షాధారంగా మొక్కజొన్న రూ.31 వేలు, నీటి వసతి కింద రూ.47 వేలు, విత్తన మొక్కజొన్నకు రూ.50 వేలుగా నిర్ణయించారు.

ఉద్యాన, కూరగాయల పంటలకు..

పచ్చిమిరపకు రూ.1.10 లక్షలు, ఎండుమిరప రూ.1.75 లక్షలు, టమాట ట్రెల్లీస్‌ లేకుండా రూ.41 వేలు, ట్రెల్లీస్‌ టమాట రూ.65 వేలు, హైబ్రీడ్‌ టమాట రూ.78 వేలు, ట్రెల్లీస్‌ హైబ్రీడ్‌ టమాట రూ.1.25 లక్షలు, వంకాయ రూ.54 వేలు, హైబ్రీడ్‌ వంకాయ రూ.67 వేలు, బెండ రూ.36 వేలు, హైబ్రీడ్‌ బెండ రూ.50 వేలు, ఉల్లి రూ.60 వేలు,మునగ రూ.49 వేలు,వర్షాధారంగా బేబీకార్న్‌కు రూ.28 వేలు, నీటి వసతి కింద రూ.44 వేలు, కరివేపాకు రూ.60 వేలు, ధనియాలు రూ.24 వేలు, సోయాబీన్స్‌ రూ.17 వేలు, అరటి ఎకరా రూ.1.10 లక్షలు, టిష్యూ కల్చర్‌ అరటి రూ.1.36 లక్షలు, దానిమ్మ రూ.1.60 లక్షలు, చీనీ రూ.71 వేలు, నిమ్మ రూ.85 వేలు, బొప్పాయి రూ.1.20 లక్షలు, మామిడి రూ.55 వేలు, సపోట రూ.43 వేలు, ద్రాక్ష రూ.1.25 లక్షలు, రేగు రూ.34 వేలు, కళింగర రూ.54 వేలు, దోస రూ.66 వేలు, జామ రూ.55 వేలు, అంజూర రూ.42 వేలు, సీతాఫలం రూ.27 వేలు, డ్రాగన్‌ఫ్రూట్‌ రూ.77 వేలు, చింత రూ.27 వేలు, కొబ్బరి రూ.70 వేలు, మల్లెపూల తోటల సాగుకు రూ. లక్ష, రోజాపూలు రూ.43 వేలు – 66 వేలు, బంతిపూలు రూ.55 వేలు, చామంతి రూ.60 వేలు, కనకాంబరాలు రూ.39 వేలు, గడ్డి సాగు రూ.36 వేలు, మల్బరీ సాగుకు రూ.1.20 లక్షల మేర స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఖరారు చేశారు.

10 నుంచి 20 శాతం పెరిగిన స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌

బ్యాంకుల్లో ప్రారంభమైన

పంట రుణాల రెన్యువల్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement