రావికమతం: కొత్తకోట పీహెచ్సీ వైద్యాధికారి –2 ఉదయ్‌కుమార్‌పై పలు ఫిర్యాదులు రావడంతో జిల్లా ఇమ్యూనిజేషన్ అధికారి చంద్రశేఖర్ దేవ్ సోమవారం విచారణ చేపట్టారు. ఇక్కడ పీహెచ్సీలో పని చేస్తున్న ఉదయ్‌కుమార్ తరుచూ విధులకు గైర్హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో పీహెచ్‌సీని సందర్శించి సిబ్బందిని తీరా తీశారు. వైద్య సేవలు, సిబ్బంది పనితీరుపై రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యాధికారి –2పై నివేదిక డీఎంహెచ్‌వోకు అందజేస్తామని, ప్రఽస్తుతం రెండో వైద్యాధికారిగా రవితేజ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం ఎంపీటీసీ పూడి దేవా, నాయకులు కోట గోవిందరావు, కోట సత్యనారాయణ, వెల్లంకి ఈశ్వరరావు పలు సమస్యలుపై వినతి పత్రం అందజేశారు. పీహెచ్సీలో రాత్రిళ్లు డాక్టర్ ఉండాలని, 108 అందుబాటులో ఉండాలని, ఆస్పత్రికి మెయిన్ గేటు ఏర్పాటు చేయాలని, తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా టీబీ, హెచ్ఐవీ అధికారి కె. స్వప్న, వైద్యులు మోహిని సురేఖ, రవితేజ, సిబ్బంది పాల్గొన్నారు.


