ఎస్.రాయవరం: ఉప్పరాపల్లి పైడితల్లమ్మ కాలువలో దిగువ రైతులకు సాగునీరు వెళ్లకుండా చేపట్టిన కాంక్రీట్ వాల్ నిర్మాణాన్ని ఆయకట్టు రైతులు ఆదివా రం అడ్డుకున్నారు. 3,600 ఎకరాలకు సాగునీరందించే కాలువలో పూర్తి స్థాయిలో పూడికతీత పనులు చేపట్టకపోగా, ఇప్పుడు టీడీపీ మండలాధ్యక్షుడు ప్రోద్బలంతో ఇరిగేషన్ అధికారులు కాంక్రీట్ వాల్ నిర్మించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిద్దరి ప్రయోజనాల కోసం వందలాది మంది రైతుల భూములకు సాగునీరు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఏఈ భాను స్పందిస్తూ కాలువలో కాంక్రీట్ వాల్ వేయడం వల్ల ఏ ఒక్కరికీ ఇబ్బందులు ఉండవని, రైతులు అడ్డుకుంటే పనులు ఆపేస్తామన్నారు. ఇరిగేషన్ మెయింటెనెన్స్ గ్రాంట్ రూ. 9 లక్షలతో పనులు చేపడుతున్నామన్నారు.


