‘అనకాపల్లిని కరువు జిల్లాగా ప్రకటించాలి’ | - | Sakshi
Sakshi News home page

‘అనకాపల్లిని కరువు జిల్లాగా ప్రకటించాలి’

Aug 31 2026 12:56 AM | Updated on Aug 31 2026 12:56 AM

ఎస్‌.రాయవరం: వచ్చే నెల 2న జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి చందబాబునాయుడు అనకాపల్లిని కరువు జిల్లాగా ప్రకటించాలని ఏపీ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన మండలంలోని రామయ్యపట్నంలో రైతు సంఘం నాయకులు పర్యటించి పొలాలను పరిశీలించారు. ఖరీఫ్‌లో నారుమడులు సైతం వర్షాభావం కారణంగా ఎండిపోయాయని వాపోయారు. ఈ ఏడాది రైతులు సాగు చేసే పరిస్థితి లేదన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేష్‌, రైతు సంఘ నాయకులు ఆర్‌. అప్పలకొండ, శివ, గోవిందు, దొరబాబు, ఆర్‌.నాగు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement