తాళపత్ర గ్రంథాల ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

తాళపత్ర గ్రంథాల ఆవిష్కరణ

Aug 30 2026 12:15 AM | Updated on Aug 30 2026 12:15 AM

నర్సీపట్నం: దాతలు ఇచ్చిన తాళపత్ర గ్రంథాలను జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుర్రి కుమార్‌ రాజా శనివారం ఆవిష్కరించారు. దాతలు సమకూర్చిన గ్రంథాలను పాఠకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ అధికారి కుమార్‌ రాజా అవార్డు పొందారు. ఈ సందర్భంగా నర్సీపట్నం శాఖాగ్రంథాలయంలో ఆయనను గ్రంథాలయ అధికారి పి.దమయంతి తదితరులు ఘనంగా సత్కరించారు. అనంతరం కుమార్‌ రాజా మాట్లాడుతూ గ్రంథాలయ అధికారి అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. తాళపత్ర గ్రంథాలను ప్రతి ఒక్కరూ చదవాలన్నారు. రాజుబాబు, సూర్యనారాయణ, వరలక్ష్మి, వరహామణి, అప్పలనాయుడు, చంద్రకళ, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement