మాకవరపాలెం హైస్కూల్‌కు ఉత్తమ క్రీడా పాఠశాల అవార్డు | - | Sakshi
Sakshi News home page

మాకవరపాలెం హైస్కూల్‌కు ఉత్తమ క్రీడా పాఠశాల అవార్డు

Aug 30 2026 12:15 AM | Updated on Aug 30 2026 12:15 AM

మాకవరపాలెం: స్థానిక ఉన్నత పాఠశాలకు ఉత్తమ క్రీడా పాఠశాల అవార్డు లభించింది. ఏటా క్రీడా దినోత్సవం రోజున జిల్లాలో ఐదు పాఠశాలలను ఉత్తమ క్రీడా పాఠశాలలుగా ఎంపిక చేస్తున్నారు. ఈ ఏడాది మాకవరపాలెం హైసూల్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడి విద్యార్థులు క్రీడల్లో రాణిస్తుండడంతో అవార్డుకు ఎంపిక చేశారు. క్రీడా దినోత్సవం సందర్భంగా శనివారం అనకాపల్లిలో డీఈవో నాగేశ్వరరావు చేతుల మీదుగా పాఠశాల హెచ్‌ఎం శ్రీనివాసరావు, పీఈటీ రవి అవార్డు అందుకున్నారు. వీరితోపాటు విద్యార్థులను డీఈవో అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement