విద్యార్థులు క్రీడల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

Aug 30 2026 12:15 AM | Updated on Aug 30 2026 12:15 AM

అనకాపల్లి టౌన్‌: హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్‌ను ప్రతి విద్యార్థీ ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో రాణించాలని డీఈవో జి.నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక బాలికోన్నత పాఠశాలలో స్కూల్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ ఎక్స్‌లెన్సీ అవార్డులను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025–26లో రాష్ట్ర స్థాయిలో జరిగిన వివిధ క్రీడల్లో జిల్లా నుంచి పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ అవార్డులు అందజేసినట్టు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 3 శాతం రిజర్వేషన్‌ కల్పించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ కె.రుధిరా రాణి, వ్యాయామ ఉపాధ్యాయులు డి.వి.ఎస్‌.కె. నాయుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement