తెనుగుపూడి గురుకుల ఇంటర్‌ విద్యార్థి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

తెనుగుపూడి గురుకుల ఇంటర్‌ విద్యార్థి అదృశ్యం

Aug 29 2026 12:46 AM | Updated on Aug 29 2026 12:46 AM

దేవరాపల్లి: మండలంలోని తెనుగుపూడి డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయానికి చెందిన ఇంటర్‌ ఫస్టియ ర్‌ విద్యార్థి కదిరి ప్రవీణ్‌ అదృశ్యమైనట్టు తండ్రి లోవరాజు, విద్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్‌ఐ వి.సత్యనారాయణ వివరాల ప్ర కారం.. కశింకోట మండలం తేగాడ గ్రామానికి చెందిన ప్రవీణ్‌ ఈ నెల 24వ తేదీ రాత్రి 7.15 గంటలకు విద్యాలయం నుంచి అదృశ్యమైనట్లు హౌస్‌ టీచర్‌ లెక్కల అర్జునరావు విద్యార్థి తండ్రికి ఫోన్లో తెలియజేశారు. అదేరోజు రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ప్రవీణ్‌ తన తండ్రికి వేరే వ్యక్తి ఫోన్‌ నుంచి చేసి రాత్రి స్నేహితుడి ఇంట్లో ఉంటానని, మరుసటి రోజు ఇంటికి లేదా హాస్టల్‌కు తిరిగి వస్తానని తెలిపినట్లు ఫిర్యా దులో పేర్కొన్నారు. సదరు విద్యార్థి ఇటు హాస్టల్‌కు అటు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పాఠశా ల సిబ్బంది పరిసర ప్రాంతాల్లో గాలించిన ఆచూకీ లభించలేదు. అనకాపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి విజ యవాడ వైపు వెళ్లే రైలులో ప్రయాణించినట్లు సమాచారం లభించింది. విద్యార్థి ఆచూకీ ఎవరికై నా లభిస్తే సమాచారం అందించాలని ఎస్‌ఐ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement