నర్సీపట్నం: తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ నెల 24 నుండి 27 వరకు జరిగిన అమరావతి ఛాంపియన్‌షిప్ కప్ బాక్సింగ్ పోటీల్లో నర్సీపట్నం నింజాస్ అకాడమికి చెందిన తొమ్మిది మంది బాలికలు మెడల్స్ సాధించారని శాప్ కోచ్ కె.అబ్బు తెలిపారు. 66 కేజీల విభాగంలో సకిరెడ్డి హరిణి, 60 కేజీల విభాగంలో లగుడు సమంత, 75 కేజీలలో బొంతు మౌనిక, 80 కేజీల విభాగాల్లో రోహిణి స్వర్ణ పతకాలు సాధించారు. 57 కేజీలు కుసుమ కుమారి, 80 కేజీల విభాగాల్లో యర్రా తేజస్విని రజత పతకాలు సాధించారు. 54 కేజీల్లో ఎస్.రిషిత, 57 కేజీల్లో జి.సాయి, 65 కేజీల విభాగాల్లో బి.యజ్ఞ కాంస్య పతకాలు సాధించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బాక్సింగ్ పోటీల్లో 460 మంది బాలికలు పాల్గొన్నారు. ఈ నెల 29న తిరుపతిలో నేషనల్ స్పోర్ట్స్ డే ప్రోగ్రాంలో స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు నగదు పురస్కారాలు అందిస్తారని శాప్ కోచ్ అబ్బు తెలిపారు. ఈ టీమ్‌కు కోచ్‌లుగా అన్నపూర్ణ, జాహ్నవి వ్యవహరించారు.


