అనకాపల్లి: ప్రజారవాణాశాఖ(ఆర్టీసీ)లో 1/2019 సర్క్యులర్‌కి విరుద్ధంగా ఇచ్చిన పనిష్మెంట్లను తక్షణమే రద్దు చేసి, ఈ.రమణ డ్రైవర్‌ను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ప్రజారవాణాశాఖ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ డిపో అధ్యక్షుడు కె.ఎన్.రమేష్ అన్నారు. అసోసియేషన్ రీజనల్ కమిటీ తీర్మానం మేరకు ఈనెల 26, 27 తేదీల్లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగులు బుధవారం నిరసన తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ఓటీ సర్వీసులకు రన్నింగ్ టైం సరిపోని కారణంగా పెంచాలని, ఓఎంఎస్ వన్ మ్యాన్ సర్వీసులకు కండక్టర్‌ని ఇవ్వాలని, ఉద్యోగులకు లీవ్ పొజిషన్ అమలు చేయాలని, ఉద్యోగులకు రెస్ట్ రూమ్స్ ఏర్పాటు చేయాలని, యూనియన్ పక్షపాత వైఖరితో అమలు చేసిన ఓడీలను రద్దు చేసి, సీనియార్టీ ప్రకారం ఓడీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.


