అనకాపల్లి: స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారిని బుధవారం రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్, చైర్మన్ పీలా నాగశ్రీనులు మంత్రి దంపతులను శాలువాలతో సత్కరించి, అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొదటిసారిగా కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి ఆలయ నిర్మాణం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.


