దేశంలో షుగర్ ఫ్యాక్టరీలు పెరుగుతుంటే ఏపీలో మూతపడుతున్నాయి. నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు హయాంలోనే రాష్ట్రంలో ఉన్న అన్ని సహకార షుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. గతంలో రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు పైగా చెరకు సాగు కాస్త.. ప్రస్తుతం 3 లక్షలకు పడిపోయింది. ఒక్క అనకాపల్లి జిల్లాలోనే ఒక లక్షా 30 వేల ఎకరాల్లో పండించే చెరకు సాగు ప్రస్తుతం 5 వేల ఎకరాలకే పరిమితమైంది. గోవాడ మూతతో 25 వేల మంది రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పుడు జిల్లాలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీల ఆస్తులన్నీంటినీ ఏపీఐఐసీ పేరిట తన పార్టీ ప్రతినిధులకు, బినామీలకు కట్టబెట్టేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు. రైతుల కంట నీళ్లొస్తున్నాయి. –కర్రి అప్పారావు, చెరకు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు


