భక్తిశ్రద్ధలతో మిలాద్‌ ఉన్‌ నబీ | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో మిలాద్‌ ఉన్‌ నబీ

Aug 27 2026 12:24 AM | Updated on Aug 27 2026 12:24 AM

కశింకోట: జిల్లాలో ముస్లింలు ఈద్‌ మిలాద్‌ ఉన్‌ నబీ (మహమ్మద్‌ ప్రవక్త) జయంతి వేడుకలు బుధవారం నిర్వహించారు. మసీదుల్లో ప్రార్థనలు, ఖురాన్‌ పఠనం చేశారు. కశింకోట మండలం బయ్యవరంలోని హజరత్‌ ఆన్సర్‌ మద్దిని బెలియా దుర్గా నుంచి బయ్యవరం గ్రామం, జాతీయ రహదారి మీదుగా కశింకోట ప్రధాన రహదారి నుంచి జామియా, నూరి మసీదుల వరకూ ర్యాలీ నిర్వహించారు. శాంతి, సౌభాగ్యం, సుఖ సంతోషాలతో అందరూ మెలగాలని, ప్రేమ, దయ, కరుణ కలిగి ఆనందంగా సోదర భావంతో ఉండాలని ముస్లిం పెద్దలు ఆకాంక్షించారు. జిల్లా మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు షేక్‌ బాబర్‌, మసీద్‌ కమిటీల ప్రతినిధులు నసీం అక్తర్‌, అబ్దుల్‌ కలాం, అబ్దుల్‌ మస్జీద్‌, ఎంఎ రబ్బానీ, సలీం, నాయమ్‌, మాక్సువల్‌, మౌలానా జాఫ్ఫార్‌, సయ్యద్‌తాజ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement