శెట్టిపాలెంలో కాఫీ ప్రాసెసింగ్‌ యూనిట్‌ | - | Sakshi
Sakshi News home page

శెట్టిపాలెంలో కాఫీ ప్రాసెసింగ్‌ యూనిట్‌

Aug 26 2026 1:12 AM | Updated on Aug 26 2026 1:12 AM

● వచ్చే నెల 4న నిర్మాణానికి శంకుస్థాపన

ప్రాసెసింగ్‌ యూనిట్‌ నిర్మాణం చేసే స్థలాన్ని పరిశీలిస్తున్న జీఎం దేవరాజు

మాకవరపాలెం : మండలంలోని శెట్టిపాలెంలో వచ్చే నెల 4న కాఫీ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు శంకుస్థాపన చేయనున్నట్టు జీసీసీ జీఎం దేవరాజు తెలిపారు. శెట్టిపాలెం గ్రామ సమీపంలో కాఫీ ప్రాసెసింగ్‌ యూనిట్‌ నిర్మాణానికి భూమిని సేకరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ భూమిని ఆయన పరిశీలించి, శంకుస్థాపనకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్‌ 4న ఈ కాఫీ యూనిట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. రూ.10 కోట్లతో 12 ఎకరాల్లో ఈ యూనిట్‌ను నిర్మిస్తున్నామన్నారు. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు శంకుస్థాపన చేయనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో జీసీసీ అధికారి విశ్వనాథం, శెట్టిపాలెం మాజీ సర్పంచ్‌ అల్లు రామునాయుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement