పోలవరం ఎడమ కాలువ పరిశీలించిన మంత్రి అనిత | - | Sakshi
Sakshi News home page

పోలవరం ఎడమ కాలువ పరిశీలించిన మంత్రి అనిత

Aug 26 2026 1:12 AM | Updated on Aug 26 2026 1:12 AM

పోలవరం కాలువను పరిశీలిస్తున్న మంత్రి అనిత, కలెక్టర్‌ విజయ్‌ కృష్ణన్‌

పాయకరావుపేట : పోలవరం ఎడమ కాలువను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్‌ విజయకృష్ణన్‌ మంగళవారం పరిశీలించారు. స్థానిక పి.ఎల్‌.పురం, సీతారాంపురం గ్రామాల పరిధిలో గల కాలువను జలహారతి కార్యక్రమం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. మంత్రి అనిత, కలెక్టర్‌ విజయకృష్ణన్‌ కాలువను పరిశీలించి, తగు ఏర్పాట్లకు అధికారులను ఆదేశించారు. వచ్చే నెల మొదటి వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కాలువను ప్రారంభోత్సవం చేయనున్నట్టు తెలిసింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, పోలవరం కాలువ ఇంజినీరింగ్‌ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement