మాట్లాడుతున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సన్యాసినాయుడు
విశాఖ–లీగల్: సెప్టెంబర్ 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు కోరారు. జిల్లా కోర్టులోని డీఎల్‌ఎస్‌ఏ కార్యాలయంలో సమాచార హక్కు చట్టంపై మంగళవా రం నిర్వహించిన చట్టపరమైన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ లోక్ అదాలత్‌లో వీలైనంత ఎక్కువ సంఖ్యలో పెండింగ్, రాజీపడ్డ దగ్గ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. సమావేశంలో వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు, ఇన్సూరెన్స్(బీమా)కంపెనీల ప్రతినిధు లు, స్టాండింగ్ కౌన్సిల్స్(న్యాయవాదులు) పాల్గొన్నారు.


