డివైడర్‌ని ఢీకొని యువకుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

డివైడర్‌ని ఢీకొని యువకుడి దుర్మరణం

Aug 26 2026 1:12 AM | Updated on Aug 26 2026 1:12 AM

ఎస్‌.రాయవరం : కోనవానిపాలెం జంక్షన్‌ సమీపంలో జాతీయ రహదారిపై బైకు డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో యువకుడు దుర్మణం చెందినట్టు ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. వివరాలివి. నక్కపల్లి మండలం సీహెచ్‌ఎల్‌ పురం గ్రామానికి చెందిన కోడి వెంకి (21) సోమవారం రాత్రి కొరుప్రోలు నుంచి ఇంటికి వెళుతుండగా ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేయబోయి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో తలకు బలమైన గాయాలు తగిలి ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి నక్కపల్లి ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాన్ని భద్రపరిచి, మంగళవారం పంచనామా నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement