సినీ దర్శకుడు పూరీ సందడి | - | Sakshi
Sakshi News home page

సినీ దర్శకుడు పూరీ సందడి

Aug 23 2026 12:16 AM | Updated on Aug 23 2026 12:16 AM

నర్సీపట్నం: సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ రాకతో శనివారం సోదరుడు, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ ఇంట్లో సందడి వాతా వరణం నెలకొంది. ఇక్కడ తల్లి సత్యవతి అలియాస్‌ అమ్మాజీని ఆలింగనం చేసుకుని సంతోషంలో మునిగి తేలారు. సోదరుడు ఉమాశంకర్‌ గణేష్‌, మరదలు కళావతి, కుటుంబ సభ్యు లు పూరీని చూసి ఆనందంతో పరవశించిపోయారు. కుటుంబ సభ్యులు అందరితో ఆయన ముచ్చటించారు. పూరీ రాకను తెలుసుకున్న అభిమానులు అధిక సంఖ్యలో గణేష్‌ ఇంటికి చేరుకున్నారు. అభిమానులందరితో ఆయన సెల్ఫీలు దిగారు. తన చిన్ననాటి స్నేహితులను చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తూ ఆనందంగా గడిపారు.

చౌడువాడలో మెగా జాబ్‌మేళా రేపు

అనకాపల్లి: జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కె.కోటపాడు మండలం చౌడువాడ ప్రభుత్వ హైస్కూల్‌లో సోమవారం మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు సంస్థ అధికారి పి. రోహిణి తెలిపారు. ఈ మేళాలో 16 బహుళ జాతీయ సంస్థలు పాల్గొని నిరుద్యోగ యువతీ, యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ మేళాలో పాల్గొనవచ్చన్నా రు. మరిన్ని వివరాలకు 79811 02224 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement