‘స్వర్ణపుష్పార్చన’ పునఃప్రారంభం | - | Sakshi
Sakshi News home page

‘స్వర్ణపుష్పార్చన’ పునఃప్రారంభం

May 23 2026 1:58 AM | Updated on May 23 2026 1:58 AM

సింహాచలం : సింహగిరి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి మూలవిరాట్‌కు శని, ఆదివారాల్లో స్వర్ణపుష్పార్చన పూజలను పునఃప్రారంభిస్తున్నట్లు దేవస్థానం ఈవో వెంకటరావు శుక్రవారం తెలిపారు. శనివారం నుంచి ఈ నిర్ణయం అమలుల్లోకి రానుంది. కోవిడ్‌ సమయం నుంచి ఇప్పటివరకు ఈ పూజలను కల్యాణమండపంలో ఉత్సవమూర్తులకు నిర్వహిస్తుండగా, ఇకపై మళ్లీ మూలవిరాట్‌ చెంతనే జరపనున్నారు. అంతేకాకుండా తొలిసారిగా శనివారాల్లో కూడా ఈ సేవను అందుబాటులోకి తెచ్చారు. ప్రతి శని, ఆదివారాల్లో మూడు బ్యాచ్‌ల్లో (ఉదయం 7.30, 9, 10.30 గంటలకు) ఈ పూజలు జరుగుతాయి. రద్దీని బట్టి ప్రతి బ్యాచ్‌కు 30 నుంచి 50 మంది ఉభయదాతలకు అంతరాలయ దర్శనంతో కూడిన అవకాశం

కల్పిస్తారు. భక్తులు ఏపీ టెంపుల్స్‌ అధికారిక వెబ్‌సైట్‌, మనమిత్ర వాట్సాప్‌ లేదా సింహగిరిపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ కేంద్రాల ద్వారా టికెట్లు పొందవచ్చు. కల్యాణమండపంలో ప్రతి గురువారం ఉదయం 7 గంటలకు ఉత్సవమూర్తులకు జరిగే స్వర్ణపుష్పార్చన యథావిధిగా కొనసాగుతుందని ఈవో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement